కొత్త కోచ్ ఎంపిక‌పై విరాట్ ఏమంటున్నాడంటే..

Fri,June 30, 2017 09:38 AM

This is what Virat Kohli has to say on New Coach selection

ఆంటిగ్వా: టీమిండియా కోచ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న‌ది. ఎప్పుడైతే కోహ్లి, కుంబ్లే విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయో అప్ప‌టి నుంచీ ఇది ఫ్యాన్స్‌కు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా కొత్త కోచ్ కోసం ఎంపిక ప్ర‌క్రియ కొన‌సాగుతున్న స‌మ‌యంలో దీనిపై తొలిసారి స్పందించాడు కెప్టెన్ విరాట్ కోహ్లి. ఒక‌వేళ బీసీసీఐ త‌మ‌కు సంప్ర‌దిస్తే.. ఒక టీమ్‌గా త‌మ స‌ల‌హాలు, సూచ‌న‌లు తాము ఇస్తామ‌ని విరాట్ చెప్పాడు. వ్య‌క్తిగ‌తంగా నేను చెప్పేది ఏమీ ఉండ‌దు. ఒక టీమ్‌గా మా అభిప్రాయాన్ని బోర్డుకు చెబుతాం. కోచ్ ఎంపిక‌కు ఓ ప్ర‌క్రియ ఉంటుంది. వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌కు అందులో తావుండ‌దు. ఒక టీమ్‌గా దీనిని గౌర‌విస్తాం. ప్ర‌క్రియ‌లో భాగంగా మా అభిప్రాయాల‌ను బోర్డు అడిగితే.. క‌చ్చితంగా చెబుతాం అని విరాట్ స్ప‌ష్టంచేశాడు. కోచ్ ఎంపిక అనేది బీసీసీఐ చేతుల్లోని అంశ‌మ‌ని, ప్ర‌స్తుతం తాము వెస్టిండీస్‌తో సిరీస్ విజ‌యంపైనే దృష్టి సారించామ‌ని అత‌ను అన్నాడు.


2426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles