నాలుగో నంబర్‌లో కోహ్లి.. చీఫ్ సెలక్టర్ మాట ఇదీ!

Mon,February 18, 2019 03:44 PM

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రస్తుతం మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింత బ్యాలెన్స్ రావడానికి కోహ్లిని వరల్డ్‌కప్‌లో నాలుగో నంబర్‌లో పంపాలని ఆలోచిస్తున్నట్లు కోచ్ రవిశాస్త్రి ఈ మధ్య చెప్పాడు. దీనిపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. కోచ్ వ్యాఖ్యలతో అతను ఏకీభవించాడు. నా అభిప్రాయం వరకు ఇది చాలా మంచి ఆలోచన. కోహ్లి నంబర్ 4లోనూ బ్యాటింగ్ చేయగలడు. కొన్ని రోజులుగా ఇదే జరుగుతున్నది. కానీ మరోసారి దీనిపై ఆలోచించాలి. ఎందుకంటే నంబర్ 3లో కోహ్లి అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం అతను వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్‌మన్. అయితే టీమ్‌కు అవసరమైతే కోహ్లి నంబర్ 4లోనూ బ్యాటింగ్ చేయగలడు. టీమ్ అవసరలేంటో చూడాలి. ఆ తర్వాతే అతని బ్యాటింగ్ స్థానంపై తుది నిర్ణయం తీసుకుంటాం అని ప్రసాద్ అన్నాడు.


కోహ్లి నాలుగో నంబర్‌లో రావడం అన్నది రవిశాస్త్రి ఆలోచన. అసలు ఇప్పుడున్న టీమ్ గొప్పతనం ఏంటంటే.. పరిస్థితులకు తగినట్లు టాప్ 3ని మనం వేరు చేయొచ్చు. కోహ్లి నంబర్ 4లో రాగలడు. నంబర్ 3తో మరో సమర్థమైన బ్యాట్స్‌మన్‌ను దింపొచ్చు. ఇది మరింత బ్యాలెన్స్ తీసుకొస్తుంది. వరల్డ్‌కప్‌లాంటి మెగా టోర్నీల్లో ఇలాంటి సౌలభ్యం ఉండాలి. మూడో నంబర్‌లో రాయుడు లేదా మరెవరైనా రావచ్చు. ఓపెనర్లను మాత్రం మార్చే ప్రసక్తే లేదు అని శాస్త్రి చెప్పాడు. నిజానికి కోహ్లి ఏడు వేర్వేరు స్థానాల్లో ఆడిన తర్వాత 2011లో నంబర్ 3లో రావడం మొదలుపెట్టాడు. సక్సెసయ్యాడు. ఈ స్థానంలో వచ్చి అతడు 32 సెంచరీలు బాదాడు. నంబర్ 4లోనూ రికార్డు బాగానే ఉంది. 23 ఇన్నింగ్స్‌లో 58 సగటుతో 1744 పరుగులు చేశాడు.

2799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles