పెళ్ల‌యిన మ‌గ‌వారికి సెహ్వాగ్ ఉప‌దేశం!

Wed,June 28, 2017 03:23 PM

This is Virender Sehwags tip to Married men to be happy

న్యూఢిల్లీ: ట‌్విట్ట‌ర్‌లో పంచ్‌ల మీద పంచ్‌లేస్తూ టైంపాస్ చేస్తున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్.. తాజాగా సోష‌ల్ మీడియాలో పెళ్లయిన మ‌గ‌వారికి ఓ టిప్ ఇచ్చాడు. జీవితం సుఖంగా సాగిపోవాలంటే ఏం చేయాలో రెండు ముక్క‌ల్లో తేల్చేశాడు. ఇంత‌కీ అత‌ను చెప్పిన ఆ సింపుల్ మంత్ర ఏంటో తెలుసా.. వైఫ్ సుఖీ.. లైఫ్ సుఖీ.. భార్య సుఖంగా ఉంటే.. జీవితం సుఖంగా ఉంటుంది.. అంతే సింపుల్‌. భార్య ఆర్తితో క‌లిసి ఉన్న ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ వీరూ ఈ కామెంట్ చేశాడు.


టీమిండియా కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న సెహ్వాగ్‌.. దాని గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా ఫ్యామిలీతో హాయిగా గ‌డిపేస్తున్నాడు. వీరూతో కోచ్ రేసులో ప్ర‌స్తుతానికి లాల్‌చంద్ రాజ్‌పుత్‌, టామ్ మూడీ, రిచర్డ్ పైబ‌స్‌, దొడ్డ గ‌ణేష్ ఉన్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో ర‌విశాస్త్రి కూడా అప్లై చేసుకోబోతున్నాడు.

3580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS