ఇలాంటి వింత రనౌట్ ఎప్పుడూ చూసి ఉండరు.. వీడియో

Fri,October 19, 2018 12:05 PM

This is One of the Most ridiculous Run Outs in Cricket history

దుబాయ్: ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఓ వింత రనౌట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు క్రికెట్ చరిత్రలో ఇంత వింత రనౌట్ ఎప్పుడూ చూసి ఉండరు. పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ అజర్ అలీ ఇలా రనౌటైన తీరు చూసి ట్విటర్ షాక్‌కు గురైంది. పీటర్ సిడిల్ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ వైపు బంతిని తరలించిన అజర్ అలీ.. అది బౌండరీ అని ఫిక్సయిపోయాడు. నాన్‌ైస్ట్రెకర్ అసద్ షఫిక్‌తో పిచ్ మధ్యలోకి వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. కానీ ఆ బాల్ బౌండరీ లైన్‌ను తాకలేదు. మిచెల్ స్టార్క్ బాల్‌ను అందుకొని వికెట్ కీపర్ టిమ్ పెయిన్‌కు విసరడం, అతను వికెట్లను గిరాటేయడంతో ఏం జరిగిందో తెలియక అజర్ అలీ బిక్క మొహం వేశాడు. కనీసం బంతి బౌండరీ లైన్‌ను కూడా తాకిందో లేదో చూడని అజర్ అలీపై అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. ఇది చూసి పాక్ కోచ్ మిక్కీ ఆర్థర్ షాక్ తిన్నాడు.


5014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles