ధోనీకి పాండ్యా ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా?

Sun,July 8, 2018 12:38 PM

కార్డిఫ్: టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ శనివారం తన 37వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా టీమ్‌మేట్స్‌తోపాటు అభిమానులంతా అతనికి బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ ప్రత్యేకమైన రోజునాడు ధోనీకి నా ప్రత్యేకమైన హెయిర్ కట్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు పాండ్యా ట్విటర్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇది ఎక్స్‌పర్ట్స్ చేసే పని.. ఇంట్లో ఎవరూ ప్రయత్నించకూడదు అంటూ కింద ఓ ఫన్నీ కామెంట్ కూడా పెట్టాడు.


ఇక బర్త్‌డే కేక్ కట్ చేసిన సందర్భంగా తాను స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు కేక్ రుద్దుతున్న వీడియోను ధోనీ షేర్ చేశాడు. టీమ్ ఎవ‌రి బ‌ర్త్ డే జ‌రిగినా వాళ్ల‌ను కేక్‌తో ముంచెత్త‌డం ధోనీకి అల‌వాటు. ఇప్పుడు త‌న బ‌ర్త్‌డే రోజు కుల్‌దీప్ కూడా ఇలాగే ధోనీని కేక్‌లో ముంచెత్త‌గా.. అత‌డు మ‌ళ్లీ రివేంజ్ తీర్చుకున్నాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌తో ధోనీ మరో రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 500 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మూడో ఇండియన్ ప్లేయర్‌గా ధోనీ నిలిచాడు. అతని కంటే ముందు సచిన్ 664, ద్రవిడ్ 509 మ్యాచ్‌లతో ఉన్నారు.

4245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles