టీమిండియా ఓట‌మి వెనుక ఆ చెన్నై ప్లేయ‌ర్‌!

Sun,February 26, 2017 04:13 PM

This Chennai man helped Okeefe to beat Team India

చెన్నై: ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్ట్‌లో అవ‌మాన‌క‌ర రీతిలో టీమిండియా ఓడిన విష‌యం తెలిసిందే క‌దా. కోహ్లి సేన అనూహ్య ప‌త‌నంలో ఆసీస్ స్పిన్న‌ర్ ఓకీఫ్‌తే కీరోల్. అయితే ఈ క్రెడిట్ ద‌క్కాల్సింది త‌న‌కు కాదు.. చెన్నైకు చెందిన శ్రీరామ్ శ్రీధ‌ర‌న్‌దే ఈ ఘ‌న‌త అంటున్నాడు ఓకీఫ్‌. అస‌లు ఓకీఫ్‌కి, శ్రీధ‌ర‌న్‌కు లింకు ఏంటి అనుకుంటున్నారా? ఎ టీమ్స్ సిరీస్ సంద‌ర్భంగా తాను చెన్నైలో శ్రీధ‌ర‌న్‌తో క‌లిసి ప‌నిచేసిన‌ట్లు ఓకీఫ్ చెప్పాడు. శ్రీధ‌ర‌న్ ప్ర‌భావం నాపై చాలా ఉంది. 2015లో ఎ సిరీస్ సంద‌ర్భంగా ఫీల్డ్‌లో శ్రీధ‌ర‌న్‌తో మాట్లాడేవాడిని. అత‌ను లోక‌ల్ వ్య‌క్తి. ఇక్క‌డి కండిష‌న్స్‌, బ్యాట్స్‌మెన్ ఎలా ఆలోచిస్తారు అన్న‌ది అత‌నికి బాగా తెలుసు. లంచ్‌టైమ్‌లో అత‌నితో క‌లిసి బౌలింగ్ చేస్తూ మెళ‌కువలు నేర్చుకున్నా అని ఓకీఫ్ చెప్పాడు.

2015 నుంచి శ్రీరామ్ శ్రీధ‌రన్ క్రికెట్ ఆస్ట్రేలియాతో క‌లిసి ప‌నిచేస్తున్నాడు. 2015లో ఆస్ట్రేలియా ఎ టీమ్ చెన్నై వ‌చ్చిన‌పుడు ఇక్క‌డి కండిష‌న్స్‌పై అత‌ను విలువైన సూచ‌న‌లు ఇచ్చాడు. ఆ త‌ర్వాత నుంచి ఆస్ట్రేలియా ఉప‌ఖండం టూర్ల‌కు శ్రీరామ్ క‌న్స‌ల్టెంట్‌గా ప‌నిచేస్తున్నాడు. ఆసీస్ ప్లేయ‌ర్స్ స్పిన్‌ను ఎలా ఎదుర్కోవాలో టిప్స్ ఇస్తుంటాడు. ఓకీఫ్‌కే కాదు శ్రీరామ్ ఇచ్చిన స‌ల‌హాలు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కూ ఉప‌యోగ‌ప‌డ్డాయి. మ‌న టీమిండియా స్పిన్న‌ర్ల‌ను స్పిన్ ట్రాక్‌ల‌పై ఎలా ఎదుర్కోవాలో శ్రీరామ్ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు స‌ల‌హా ఇచ్చాడు. శ్రీధ‌ర‌న్ అద్భుత‌మైన స్పిన్ బౌలింగ్ కోచ్‌. అత‌నితో క‌లిసి రెండుసార్లు ప‌నిచేశాను. ఆ ప్ర‌భావం నాపై చాలా ఉంది అని ఓకీఫ్ చెప్పాడు.

నిజానికి తొలి టెస్ట్ రెండోరోజు తొలి సెష‌న్‌లో ఓకీఫ్ ఒక్క వికెట్ కూడా తీయ‌క‌పోవ‌డంతో అత‌ను ఎక్క‌డ త‌ప్పు చేస్తున్నాడో శ్రీరామ్ చెప్పాడు. లంచ్ బ్రేక్‌లో శ్రీరామ్ ఇచ్చిన టిప్స్‌తో రెండో సెష‌న్‌లో చెల‌రేగిన ఓకీఫ్‌.. టీమిండియా కొంప ముంచాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా శ్రీరామ్ సేవ‌ల‌ను కొనియాడాడు. ఇప్ప‌టివ‌ర‌కు శ్రీరామ్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌తోపాటు శ్రీలంక టూర్లో ఆసీస్ టీమ్‌కు సేవ‌లందించాడు. అయితే ఆ రెండు సిరీస్‌ల‌లో ఆసీస్ ఘోర‌మైన ఫ‌లితాలు సాధించినా.. శ్రీరామ్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా న‌మ్మక‌ముంచింది. టీమిండియా ఓట‌మి రూపంలో దానికి స‌త్ఫ‌లితాలు ఇప్పుడు క‌నిపిస్తున్నాయి.

4417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles