మొన్న మెడల్ గెలిచాడు.. ఇప్పుడు చాయ్ అమ్ముతున్నాడు!

Fri,September 7, 2018 02:40 PM

This Asian Games medalist now selling tea in Delhi streets

న్యూఢిల్లీ: ఈసారి ఏషియన్ గేమ్స్‌లో ఎన్నడూ లేని స్థాయిలో ఇండియా మెడల్స్ గెలిచింది. 15 గోల్డ్ మెడల్స్‌తోపాటు మొత్తం 69 మెడల్స్ భారత్ ఖాతాలో చేరాయి. ఆ మెడల్స్ గెలిచిన వాళ్లలో ఢిల్లీకి చెందిన హరీష్ కుమార్ కూడా ఒకడు. సెపక్‌తక్రాలో బ్రాంజ్ మెడల్ గెలిచాడు. మెడల్స్ గెలిచిన వాళ్లందరికీ ఆయా రాష్ర్టాలు భారీ నగదు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. అవి వచ్చాయో లేదో తెలియదుగానీ.. హరీష్ మాత్రం గేమ్స్ ముగిసిన రోజుల వ్యవధిలోనే మళ్లీ తన పనిలో నిమగ్నమయ్యాడు. ఆ పని చాయ్ అమ్మడం. ఢిల్లీలోని మజ్నుకాతిల్లా ప్రాంతంలో తన తండ్రి నడిపే టీ షాపును హరీష్ చూసుకుంటున్నాడు. తనది చాలా పెద్ద కుటుంబమని, వాళ్లందరినీ పోషించడానికి ఈ టీ దుకాణమే ఆధారం కావడంతో తనకు చాయ్ అమ్మడం తప్ప మరో మార్గం లేదని హరీష్ చెబుతున్నాడు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు ప్రాక్టీస్‌కు కేటాయిస్తానని, మిగతా సమయమంతా ఇదే పనిలో ఉంటానని అతను చెప్పాడు.

ఏదైనా మంచి జాబ్ వస్తే తన కుటుంబాన్ని బాగా చూసుకుంటానని హరీష్ అంటున్నాడు. 2011లో తాను సెపక్‌తక్రా ఆడటం మొదలుపెట్టినట్లు అతను తెలిపాడు. కోచ్ హేమరాజ్ నన్ను ఈ గేమ్‌లోకి తీసుకొచ్చాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు వెళ్లినప్పటి నుంచీ నెలకు కొంత మొత్తంతోపాటు కిట్స్ కూడా వస్తున్నాయి అని హరీష్ చెప్పాడు. అతనిది నిరుపేద కుటుంబం. రోజు గడవడం కూడా కష్టమే. ఇప్పటికైతే తమను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదుకుంటున్నదని, హరీష్‌కు ఓ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తే తమ కుటుంబం దారిన పడుతుందని హరీష్ తల్లి, సోదరుడు ధావన్ అంటున్నారు.

4402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS