రేపటి మ్యాచ్‌కు 1800 మంది పోలీసులతో భద్రత: సీపీThu,October 12, 2017 04:44 PM

రేపటి మ్యాచ్‌కు 1800 మంది పోలీసులతో భద్రత: సీపీ

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రేపు జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు పోలీసుల భద్రతపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ.. రేపు సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఉండటం వల్ల 4 గంటలకు స్టేడియం గేట్లు ఓపెన్ చేస్తామని సీపీ తెలిపారు. 1800 మంది పోలీసులతో స్టేడియం దగ్గర్లో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. స్టేడియం పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని... ఈ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయబడి ఉన్నాయని ఆయన తెలియజేశారు.

మొబైల్ ఫోన్‌ను స్టేడియంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపిన సీపీ.. పవర్ బ్యాంక్‌ను మాత్రం తీసుకురావద్దని చెప్పారు. లాప్‌టాప్స్, కెమెరాలు, హెల్మెట్లు, బ్యాగులు, పెన్నులు, సిగిరేట్లు, అగ్గిపెట్టె, లైటర్, వాటర్ బాటిల్స్‌కు స్టేడియంలో అనుమతి లేదన్నారు. అమ్మాయిలను వేధించే పోకిరీలను కట్టడి చేసేందుకు షీ టీమ్స్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో నిఘా వేసి ఉంటాయని సీపీ ఈ సందర్భంగా వెల్లడించారు.


2235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS