నిన్న‌ కోహ్లీ.. నేడు హ‌ర్మ‌న్ స్ట‌న్నింగ్ క్యాచ్: వీడియోలు

Sat,December 15, 2018 02:38 PM

The Harmanpreet Kaur show continues in Hobart

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ పట్టిన స్ట‌న్నింగ్‌ క్యాచ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఇషాంత్ శర్మ వేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 55వ ఓవర్‌లో తొలి బంతిని పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ (7) థర్డ్ మ్యాన్ దిశగా బాద‌గా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ మెరుపు వేగంతో స్పందించాడు. అమాంతం గాల్లోకి లేచి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. తాజాగా అలాంటి వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మ‌హిళ‌ల బిగ్ బాష్ లీగ్‌లో కోహ్లీ స్టైల్‌లోనే భార‌త మ‌హిళా టీ20 టీమ్ కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ శ‌నివారం క‌ళ్లుచెదిరే క్యాచ్ అందుకుంది. బీబీఎల్‌లో కౌర్ సిడ్నీ థండ‌ర్స్ త‌ర‌ఫున ఆడుతోంది.3062
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles