లండన్ వీధుల్లో సైకిల్‌పై నడాల్ చెక్కర్లు.. వీడియో

Mon,July 9, 2018 05:49 PM

Tennis world number one Rafeal Nadal took a ride on bicycle in London

లండన్: స్టార్ టెన్నిస్ ప్లేయర్, వరల్డ్ నంబర్ వన్ రఫెల్ నడాల్ తన బిజీ వింబుల్డన్ షెడ్యూల్ నుంచి కాస్త టైమ్ తీసుకున్నాడు. లండన్ వీధుల్లో సైకిల్‌పై చెక్కర్లు కొట్టాడు. ఇంతకీ నడాల్ సైకిల్‌పై ఎక్కడికి వెళ్లాడో తెలుసా.. కిరాణా సామాను తెచ్చుకోవడానికి. ఈ వీడియోను అతడే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఎవరో ఒకరు వెళ్లి కిరాణా సామాను తేవాల్సిందే కదా అంటూ ఈ వీడియోకు అతడో క్యాప్షన్ పెట్టాడు. వింబుల్డన్‌లో నడాల్ ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్ చేరాడు. మంగళవారం చెక్ రిపబ్లిక్‌కు చెందిన అన్‌సీడెడ్ ప్లేయర్ జిరి వెస్లీతో అతడు క్వార్టర్స్‌లో తలపడనున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ను రికార్డు స్థాయిలో 11వ సారి గెలిచిన నడాల్.. వింబుల్డన్‌ను గెలవాలన్న పట్టుదలతో ఉన్నాడు. అయితే అతనికి తన చిరకాల ప్రత్యర్థి ఫెదరర్ నుంచి ప్రమాదం పొంచి ఉంది.

1552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles