25 నుంచి తెలంగాణ ప్రీమియర్ లీగ్

Wed,January 3, 2018 06:27 AM

Telangana Premier League starts from this 25th

హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) రెండవ సీజన్ జనవరి 25నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను టీపీఎల్ సీఎండీ మన్నె గోవర్దన్‌రెడ్డి వెల్లడించారు. గత ఏడాది ప్రారంభమైన టీపీఎల్ మొదటి సీజన్‌కు మంచి ఆదరణ లభించిందన్నారు. ఈ యేడాది రెండో సీజన్‌లో 12 జట్లు బరిలోకి దిగనున్నాయన్నారు. తెలంగాణ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభగలిగిన క్రికెటర్లను గుర్తించి వారికి ప్రోత్సాహం ఇచ్చేందుకు టీపీఎల్‌ను నిర్వహిస్తున్నామన్నారు. టీపీఎల్ రెండో సీజన్‌కు మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు టీపీఎల్ కొనసాగుతుందని పేర్కొన్నారు.

1399
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles