బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. ఇండియా ఫీల్డింగ్

Fri,September 21, 2018 04:36 PM

Team India won the toss and elected field first against Bangladesh

దుబాయ్: ఏషియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఇక్కడ ఇప్పటికే రెండు మ్యాచులు ఆడామని, చేజింగ్ ఈజీగా ఉండటం వల్ల మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజా టీమ్‌లోకి వచ్చాడు. అటు బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌కు రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతున్న‌ది. ముష్ఫిక‌ర్ ర‌హీమ్‌, ముస్త‌ఫిజుర్ రెహ‌మాన్ టీమ్‌లోకి వ‌చ్చారు. అటు మ‌రో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్ఘ‌నిస్థాన్‌.


3144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles