ఇంగ్లండ్‌లో టీమిండియా లాంగ్ టూర్‌

Tue,September 5, 2017 05:13 PM

Team India to go to England next year for full series

ముంబై: వ‌చ్చే ఏడాది జులైలో ఇంగ్లండ్ టూర్‌కు వెళ్ల‌నుంది టీమిండియా. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడులైంది. సుమారు రెండున్న‌ర నెల‌ల పాటు ఈ టూర్ కొన‌సాగ‌నుంది. మూడు టీ20లు, మూడు వ‌న్డేలు, 5 టెస్టుల‌తో పూర్తిస్థాయి లాంగ్ టూర్ ఖ‌రారైంది. జులై 3న ఓల్డ్ ట్రాఫ‌ర్డ్‌లో జ‌రిగే తొలి టీ20తో టూర్ మొద‌లవుతుంది. జులై 5న కార్డిఫ్‌లో రెండో టీ20, 8న బ్రిస్ట‌ల్‌లో మూడో టీ20 ఆడుతుంది. ఆ త‌ర్వాత జులై 12న ట్రెంట్‌బ్రిడ్జ్‌లో తొలి వ‌న్డే జ‌రుగుతుంది. జులై 14న లార్డ్స్‌లో రెండో వ‌న్డే, 17న హెడింగ్లేలో మూడో వ‌న్డే జ‌ర‌గ‌నుంది. ఆగ‌స్ట్ 1న ఎడ్‌బాస్ట‌న్ తొలి టెస్ట్‌కు ఆతిథ్య‌మిస్తుంది. ఆగ‌స్ట్ 9 నుంచి లార్డ్స్‌లో రెండో టెస్ట్‌, ఆగ‌స్ట్ 18 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్‌లో మూడో టెస్ట్‌, ఆగ‌స్ట్ 30 నుంచి ఎజియాస్ బౌల్‌లో నాలుగో టెస్ట్‌, సెప్టెంబ‌ర్ 7న కియా ఓవ‌ల్‌లో ఐదో టెస్ట్ జ‌రుగుతుంది.

చివ‌రిసారి 2014లో ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లింది టీమిండియా. అప్పుడు ధోనీ కెప్టెన్సీలో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. ఆ త‌ర్వాత ఈ ఏడాది మొద‌ట్లో ఇంగ్లండ్‌లో చాంపియ‌న్స్ ట్రోఫీ ఆడింది ఇండియ‌న్ టీమ్‌. ఈ టోర్నీ సెమీస్ వ‌ర‌కు చేరింది. ఇక వ‌చ్చే ఏడాది ఇంగ్లండ్ టూర్‌తోపాటు ఏడాది మొద‌ట్లోనే కీల‌క‌మైన సౌతాఫ్రికా టూర్‌కి కూడా టీమ్ వెళ్ల‌నుంది. ఈ లెక్క‌న కెప్టెన్ కోహ్లికి అస‌లు సిస‌లు స‌వాలు విస‌ర‌నుంది 2018.

5205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles