ఓపెనర్లు ఔట్.. ఇన్నింగ్స్ ఓటమి తప్పేలా లేదు

Sun,August 12, 2018 05:45 PM

Team India staring at Innings defeat after losing openers early

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి దిశగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 289 పరుగుల భారీ ఆధిక్యాన్ని సమర్పించుకున్న కోహ్లి సేన.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అప్పుడే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇప్పటికే పెవిలియన్ చేరడంతో లంచ్ సమయానికి 2 వికెట్లకు 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంకా 272 పరుగులు వెనుకబడే ఉంది టీమిండియా. విజయ్ డకౌట్ కాగా.. రాహుల్ 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా(5 నాటౌట్), రహానే(1 నాటౌట్) ఉన్నారు. బ్యాట్స్‌మెన్ తొలి ఇన్నింగ్స్‌లాగే తడబడుతుండటంతో భారీ ఇన్నింగ్స్ ఓటమి తప్పేలా కనిపించడం లేదు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 7 వికెట్లకు 396 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. క్రిస్ వోక్స్ 137 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. బెయిర్‌స్టో 93 పరుగులు చేశాడు. మహ్మద్ షమి, పాండ్యా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

3475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles