తొలి వన్డేకు ఆ ఇద్దరినీ పక్కన పెట్టిన టీమ్

Fri,January 11, 2019 04:29 PM

Team India management dropped Hardik Pandya and KL Rahul from first ODI against Australia

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి వన్డేకు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లను పక్కన పెట్టింది టీమిండియా. కాఫీ విత్ కరణ్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఈ ఇద్దరూ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ ఇద్దరికి ఎలాంటి శిక్షలు వేయాలో నిర్ణయం తీసుకోనప్పటికీ మేనేజ్‌మెంట్ మాత్రం రిస్క్ తీసుకోవడం లేదు. రాహుల్ పేరును అసలు పరిశీలించలేదని, పాండ్యా విషయానికి వస్తే శనివారం జరిగే తొలి వన్డేకు మాత్రం ఉండబోడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బోర్డు నుంచి తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్న కారణంగా తుది జట్టులో నిన్ను తీసుకోవడం లేదని పాండ్యాకు ఇప్పటికే టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. ఇక రాహుల్ అయితే అసలు తుది జట్టు పరిశీలనలోనే లేడు అని ఆ వర్గాలు చెప్పాయి. ఆ ఇద్దరిపై సస్పెన్షన్ విధిస్తారా, వాళ్లను తిరిగి ఇండియాకు పంపించాలా అన్న అంశంపై బోర్డు నుంచి అధికారిక సమాచారం కోసం మేనేజ్‌మెంట్ వేచి చూస్తున్నది. ఇప్పటికే సీఓఏ మెంబర్ అయిన డయానా ఎడుల్జీ కూడా ఈ ఇద్దరిపై సస్పెన్షన్ విధించడమే సరైందని చెప్పిన విషయం తెలిసిందే.

3004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles