కష్టాల్లో టీమిండియా.. లంచ్ టైమ్‌కు 46/3

Sun,September 2, 2018 05:42 PM

Team India lose 3 early wickets in chase of 245 against England

సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో కష్టాల్లో పడింది టీమిండియా. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లి సేన.. నాలుగో రోజు లంచ్ సమయానికే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 3 వికెట్లకు 46 పరుగులతో ఉంది. విజయానికి ఇంకా 199 పరుగుల దూరంలో ఉంది. అయితే ఇప్పటికే ఓపెనర్లు కేఎల్ రాహుల్ (0), ధావన్ (17), ఆపద్బాంధవుడు పుజారా (5) ఔటయ్యారు. క్రీజులో కోహ్లి (10 నాటౌట్), రహానే (13 నాటౌట్) ఉన్నారు. నిజానికి 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సమయంలో ఈ ఇద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. లంచ్ లోపు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటం.. అస్థిరమైన బౌన్స్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నది. రెండో సెషన్ కీలకంగా మారింది. కోహ్లి, రహానే ఇంగ్లండ్ బౌలర్లను ఎంతసేపు నిలువరించగలరన్న దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.

3391
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS