బాలీవుడ్ హీరోయిన్‌తో రవిశాస్త్రి డేటింగ్!

Mon,September 3, 2018 01:09 PM

Team India coach Ravi Shastri is dating with Bollywood actress Nimrat Kaur

లండన్: క్రికెట్ ఆడే రోజుల్లో ఇప్పటి టీమిండియా కోచ్ రవిశాస్త్రికి లవర్‌బాయ్‌గా పేరుంది. ఆ రోజుల్లో టీమ్‌లో కాస్త హ్యాండ్సమ్‌గా ఉండే ప్లేయర్స్‌లో రవిశాస్త్రి ఒకడు. పైగా ప్లేబాయ్ టైపు. దీంతో సహజంగానే ఆటతోపాటు బయట జల్సాలు కూడా ఎక్కువే. నిజానికి ఇప్పుడు టీమ్‌లో ఉన్న ప్లేయర్స్‌ను కూడా అలాగే ఎంజాయ్ చేయనివ్వాలి అని శాస్త్రి తరచూ చెబుతుంటాడు. అప్పట్లో బాలీవుడ్ నటి అమృతాసింగ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. ఆ తర్వాత వాళ్ల బంధం తెగిపోయింది. రీతూను పెళ్లి చేసుకున్నా.. పదేళ్ల నుంచి వేరుగానే ఉంటున్నారు. ఇప్పుడు 56 ఏళ్ల వయసులో ఓ కొత్త తోడు కోసం రవి వెతుక్కుంటున్నాడు. ఇప్పుడు కూడా అతని కన్ను ఓ బాలీవుడ్ నటిపైనే పడింది. ఆమె పేరు నిమ్రత్ కౌర్. రవిశాస్త్రి కంటే వయసులో 20 ఏళ్లు చిన్నది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించిన ఎయిర్‌లిఫ్ట్ మూవీతో నిమ్రత్ ఫేమసైంది. ఈ ఇద్దరూ రెండేళ్ల నుంచి సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నట్లు ముంబై మిర్రర్ పత్రిక వెల్లడించింది.

నిజానికి 2015 నుంచి ఈ ఇద్దరిని లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తమ కొత్త కార్ల లాంచింగ్‌కు పిలుస్తున్నది. మూడేళ్లుగా ఎన్నో మోడల్స్‌ను రవి, నిమ్రత్ కలిసి లాంచ్ చేశారు. అయితే ఆ కొత్త కార్లు వీళ్ల మనసుల్ని కూడా కలిపాయన్న సంగతి ఇప్పుడే బయటపడింది. క్రికెట్ ఆడుతున్న రోజుల్లో అయినా, ఆ తర్వాత టీమ్ డైరెక్టర్‌గా, ఇప్పుడు కోచ్‌గా రవిశాస్త్రి ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటాడు. నిమ్రత్ మాత్రం కాస్త లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తుంది. రెండేళ్లుగా కలిసి తిరుగుతున్నా ఎప్పుడూ వీళ్లు మీడియా కంట పడకపోవడం విశేషం. తమ రిలేషన్‌షిప్‌పై ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే డేటింగ్‌లో ఉన్న విషయం ఇప్పుడు మీడియాకు కూడా తెలిసిపోయింది. మరి ఇప్పటికైనా ఈ సెలబ్రిటీ జోడీ తమ బంధాన్ని బయటపెడుతుందా లేదా చూడాలి. ప్రస్తుతం రవిశాస్త్రి టీమిండియాతోపాటు ఇంగ్లండ్ టూర్‌లో ఉండగా.. నిమ్రత్ ఓ వెబ్‌సిరీస్ షూటింగ్‌లో ఉంది.

6136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles