పంత్ వచ్చేస్తున్నాడు.. ధావన్‌ను గమనిస్తున్నాం..!

Wed,June 12, 2019 05:11 PM

Team India batting Coach Sanjay Bangar on Shikhar Dhawan

లండన్: గాయపడిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌ను బీసీసీఐ వైద్య బృందం నిరంతరం గమనిస్తున్నదని భారత్ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపారు. ధావన్ స్థానంలో మరో ఆటగాడి ఎంపిక గురించి ఆయన మాట్లాడుతూ.. ధావన్ కోలుకునేందుకు కనీసం 10-12 రోజుల సమయం పడుతుంది. అతనికి అన్ని విధాలా సహకారం అందిస్తాం. అవసరమైతే అతని స్థానంలో తుదిజ‌ట్టుకు విజయ్ శంకర్‌ను ఎంపిక చేస్తాం. ఇంకో ఆటగాడిని అందుబాటులో ఉంచుకోవడం ఎప్పటికైనా మంచిదే. కావున, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ త్వరలోనే మాంచెస్టర్‌లో అడుగుపెట్టనున్నాడు. అని బంగర్ వివరించాడు.

గబ్బర్ స్థానంలో రోహిత్ శర్మతో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ బరిలో దిగడం దాదాపుగా ఖాయం. నాలుగో స్థానానికి ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ రేసులో ఉన్నారు. దురదృష్టవశాత్తూ మరో ఆటగాడు ఎవరైనా గాయపడితే అప్పటికప్పుడు ఇంకో ఆటగాడిని ఎంచుకోవడం ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యంలో పంత్‌ను ముందు జాగ్రత్తగా ఇంగ్లాండ్‌కు రప్పిస్తున్నారు.

3966
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles