రెండో రోజు 22 పరుగులే.. టీమిండియా ఆలౌట్

Sun,August 19, 2018 05:06 PM

ట్రెంట్‌బ్రిడ్జ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 329 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఉదయం అరగంటలోనే కోహ్లి సేన మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. 6 వికెట్లకు 307 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. మరో 22 పరుగులు మాత్రమే జోడించింది. చివర్లో 6 పరుగుల తేడాలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. 323 పరుగుల దగ్గర రిషబ్ పంత్ (24) ఔటవడంతో వికెట్ల పతనం మొదలైంది. ఆ వెంటనే అశ్విన్ (14), షమి, బుమ్రా కూడా ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, ఆండర్సన్, క్రిస్ వోక్స్ తలా మూడు వికెట్లు తీసుకున్నారు. రెండో రోజు కేవలం 7.5 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఇక టీమిండియాలో కెప్టెన్ కోహ్లి 97, రహానే 81 పరుగులు చేసిన విషయం తెలిసిందే.6676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles