కోహ్లియే బాస్ అయితే.. వాళ్ల‌కు కోచ్ ఎందుకు?

Fri,June 23, 2017 04:54 PM

బెంగ‌ళూరు: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీరును చీల్చి చెండాడాడు మాజీ స్పిన్న‌ర్ ఎరాప‌ల్లి ప్ర‌స‌న్న‌. కోహ్లియే బాస్‌లాగా ఫీలైతే.. ఇక టీమ్‌కు కోచ్ ఎందుకు అని అత‌ను అన్నాడు. వాళ్ల‌కు బ్యాటింగ్‌, ఫీల్డింగ్ (సంజ‌య్ బంగార్‌, ఆర్ శ్రీధ‌ర్‌) కోచ్‌ల అవ‌స‌రం కూడా లేదు అని ప్ర‌స‌న్న తీవ్రంగా స్పందించాడు. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మ‌న్ అయి ఉండొచ్చు కానీ.. అత‌ను కెప్టెన్‌గా విజ‌య‌వంత‌మ‌వుతాడా లేదా అన్న‌ది చెప్ప‌లేమ‌ని అత‌న‌న్నాడు. అనిల్ కుంబ్లేలాంటి లెజెండ‌రీ ప్లేయ‌ర్‌కే ప్లేయ‌ర్స్ గౌర‌వం ఇవ్వ‌న‌పుడు బంగార్‌, శ్రీధ‌ర్‌ల‌కు ఎలా ఇస్తారు. కోహ్లితో ధైర్యంగా మాట్లాడేంత ద‌మ్ము వాళ్ల‌కు లేద‌నే అనుకుంటున్నా. ఆ ఇద్ద‌రూ కుంబ్లే అంత అనుభ‌వ‌జ్ఞులు కారు అని ప్ర‌స‌న్న అన్నాడు.


ఓ ఫిజిక‌ల్ ట్రైనర్‌ను నియ‌మించండి.. చాలు అన్న‌దే కోహ్లి ఆలోచ‌న అయితే.. టీమ్‌కు కోచ్ అవ‌స‌ర‌మే లేదు అని అత‌ను స్ప‌ష్టంచేశాడు. విరాట్ వ్య‌వ‌హార తీరుపై ప్ర‌స‌న్న తీవ్ర అసంతృప్తి వ్య‌క్తంచేశాడు. కోహ్లి పూర్తి బాధ్య‌త తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉంటే.. పాత రోజుల్లాగా ఓ మేనేజ‌ర్‌ను నియ‌మిస్తే స‌రి. కోచ్ పాత్ర ఏంటో ఇప్ప‌టికీ ఎవ‌రూ వివ‌రించ‌లేదు అని ప్ర‌స‌న్న చెప్పాడు. ఇక కోచ్ ఎంపిక ప్ర‌క్రియ‌ను కూడా పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అత‌ను తెలిపాడు. అటు టీమ్ ఇంకా యువ‌రాజ్‌, ధోనీలాంటి సీనియ‌ర్ల‌పై ఆధార‌ప‌డ‌టం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. 2019 వ‌ర‌ల్డ్‌క‌ప్ క‌ల్లా వీరికి 38 ఏళ్లు నిండుతాయి. ధోనీ వికెట్ కీపింగ్ చేస్తాడేమో కానీ.. యువీ మాత్రం టీమ్‌కు భార‌మే. క‌నీసం వెస్టిండీస్ టూర్‌కైనా ఇంకొంత‌మంది యువ‌కుల‌కు చాన్స్ ఇవ్వాల్సింది అని ప్ర‌స‌న్న అన్నాడు.

3354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles