చెన్నై టార్గెట్‌ 162

Sun,April 14, 2019 06:00 PM

Tahir Picks Four to Restrict KKR to 161

కోల్‌కతా: ఈడెన్‌ గార్డెన్స్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్‌ క్రిస్‌లిన్‌(82: 51 బంతుల్లో 7ఫోర్లు, 6సిక్స్‌లు) రాణించడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. మిగతా బ్యాట్స్‌మన్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. చెన్నై స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌(4/27) సంచలన ప్రదర్శనతో కోల్‌కతాను దెబ్బకొట్టాడు. శార్దుల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లతో కోల్‌కతాను కట్టడి చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా(21), దినేశ్‌ కార్తీక్‌(18), శుభ్‌మన్‌ గిల్‌(15), ఆండ్రీ రస్సెల్‌(10), ఊతప్ప(0) విఫలమయ్యారు.

923
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles