స్విట్జర్లాండ్ సూపర్ విక్టరీ

Sat,June 23, 2018 10:47 AM

Switzerland secures stunning win over Serbia at football worldcup


మాస్కో: ఫుట్‌బాల్ వరల్డ్ కప్ గ్రూప్ ఈ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ అద్భుత విక్టరీ సాధించింది. శుక్రవారం సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 2-1 గోల్స్ తేడాతో నెగ్గింది. ఆట 90వ నిమిషంలో జిర్దాన్ షాకిరి చేసిన సూపర్ సోలో గోల్‌తో స్విస్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. హాఫ్‌వే గ్రౌండ్ నుంచి బంతిని డ్రిబ్లింగ్ చేసిన షాకిరి డిఫెన్స్‌ను చేధిస్తూ అద్భుతమైన గోల్ చేశాడు. వాస్తవానికి ఆట 5వ నిమిషంలోనే సెర్బియా గోల్ చేసింది. ఆ టీమ్ తరపున మెట్రోవిక్ ఆ గోల్ చేశాడు. అయితే ఫస్ట్ హాఫ్‌లో 1-0 గోల్స్ తేడాతో సెర్బియా లీడ్‌లో ఉంది. కానీ సెకండ్ హాఫ్‌లో స్విట్జర్లాండ్ దూకుడుగా ఆడింది. 52వ నిమిషంలో జాకా గోల్ చేసి స్విస్‌ను ఆదుకున్నాడు. ఈ విక్టరీతో గ్రూప్ ఈలో బ్రెజిల్‌తో పాటు స్విస్ కూడా నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే గోల్ డిఫెరెన్స్ తేడా వల్ల ప్రస్తుతం స్విస్ రెండవ స్థానంలో నిలిచింది. ఒకవేళ కోస్టా రికాతో డ్రా చేసుకుంటే ఆ టీమ్ క్వార్టర్స్‌కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో స్విస్ గెలిస్తే, అప్పుడు బ్రెజిల్ మీద సెర్బియా గెలిస్తే ఆ జట్టు ముందుకు వెళ్తుంది.

721
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS