కోస్టారికాతో డ్రా.. ప్రీక్వార్టర్స్‌కు స్విట్జర్లాండ్

Thu,June 28, 2018 09:38 AM

Switzerland enters knock out stage after draw with Costa Rica


మాస్కో: వరల్డ్‌కపల్ ఫుట్‌బాల్‌లో స్విట్జర్లాండ్ నాకౌట్ బర్త్ ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన గ్రూప్ ఈలో కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌లో 2-2 గోల్స్ తేడాతో స్విస్ డ్రా చేసుకుంది. దీంతో గ్రూప్‌లో స్విట్లర్లాండ్ రెండవ స్థానంలో నిలిచింది. ప్రీక్వార్టర్స్‌లో స్వీడన్‌తో స్విట్జర్లాండ్ పోటీపడనుంది. ఫస్ట్ హాఫ్‌లో స్విట్జర్లాండ్ లీడ్ తీసుకుంది. 31వ నిమిషంలో స్విస్ ప్లేయర్ బెరిమ్ జిమైలి గోల్ చేశాడు. కోస్టారికా ఆరంభంలో జోరు మీదున్నా.. ఆ టీమ్‌కు గోల్ దక్కలేదు. అయితే సెకండ్ హాఫ్ 56వ నిమిషంలో కెండల్ వాట్సన్.. కోస్టారికాకు గోల్ అందించాడు. దీంతో ఇరు జట్లు సమానం అయ్యాయి. అయితే 88వ నిమిషంలో డిమ్రిక్ గోల్ చేసి స్విట్జర్లాండ్‌కు లీడ్ ఇచ్చాడు. కానీ చివర్లో మరో డ్రామా చోటుచేసుకుంది. కోస్టారికాకు పెనాల్టీ వచ్చింది. ఆ పెనాల్టీ ఛాన్స్‌ను కోస్టారికా గోల్‌గా మలుచుకుంది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే పాయింట్ల ఆధారంగా స్విస్ ఆ గ్రూప్‌లో రెండవ స్థానంలో నిలిచింది.

509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles