స్విస్‌కు షాక్.. క్వార్టర్స్‌కు స్వీడన్

Tue,July 3, 2018 09:48 PM

Sweden beat Switzerland 1-0 to enter quarter-finals

సెయింట్‌ పీటర్స్‌బర్గ్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో సంచలనం. ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్‌కు షాక్. స్విస్‌పై అద్భుత ప్రదర్శన చేసిన స్వీడన్ సంచలన విజయంతో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో స్వీడన్ 1-0తో స్విట్జర్లాండ్‌పై జయభేరి మోగించింది. రెండు అర్ధభాగాల్లోనూ స్వీడన్ ఆటగాళ్లు పోరాట పటిమ కనబర్చారు. స్వీడన్ డిఫెన్స్‌ను ఛేదించలేక స్విస్ ఆటగాళ్లు గోల్ చేయడంలో విఫలమయ్యారు.

స్వీడన్‌తో పోరుకు స్విస్ తమ జట్టులో నాలుగు మార్పులు చేసింది. ఆరంభం నుంచి మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. ద్వితీయార్ధంలో 66వ నిమిషంలో ఓలా నుంచి పాస్ అందుకున్న ఎమిల్ ఫోర్సబెర్గ్ గోల్ పోస్ట్‌లోకి బంతిని పంపి స్వీడన్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఆ తరువాత మ్యాచ్ ముగిసేవరకు మరో గోల్ నమోదు కాలేదు. ఇంజురీ సమయంలో (90+ 3) స్విస్ ఫుట్‌బాలర్ మైకేల్ లాంగ్‌కు రిఫరీ రెడ్‌కార్డ్ చూపించాడు. దీంతో స్వీడన్‌కు పెనాల్టీ లభించింది. ఫ్రీకిక్ లభించడంతో అంతా గోల్ ఖాయమని అనుకున్నారు. కానీ, స్విస్ కీపర్ యాన్ సోమర్ ఓలా తన్నిన బంతిని అడ్డుకోవడంతో స్కోర్ డబుల్ చేసుకునే అవకాశం లేకపోయింది.

1066
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS