దేవుడి దయవల్ల నేను బాగానే ఉన్నాను!

Tue,February 12, 2019 06:49 PM

Suresh Raina slams reports of his death in road accident on social media

ఢిల్లీ: సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం అంతా అబద్ధమని టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా ట్విటర్‌లో తెలిపాడు. కారు ప్రమాదంలో రైనా తీవ్రంగా గాయపడ్డాడని, చ‌నిపోయాడ‌ని కొంతమంది నెటిజన్లు యూట్యూబ్‌లో పుకార్లు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ రైనా స్పందించాడు. ''నేను కారు ప్రమాదంలో గాయపడ్డానని కొన్ని రోజులుగా ఫేక్ న్యూస్ ప్రచారంలో ఉంది. ఆ పుకారుతో మా కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దయచేసి అలాంటి ఫేక్‌న్యూస్‌ను నమ్మొద్దు. వాటిని ప్రచారం చేయడం ఆపేయండి. దేవుడి దయవల్ల నేను బాగానే ఉన్నాను. ఇలాంటి పుకారును సృష్టించి వైరల్ చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌ను గుర్తించాం. త్వరలోనే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని'' రైనా హెచ్చరించారు. ఫామ్ కోల్పోయిన రైనా కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మరికొన్ని నెలల్లో ఐపీఎల్ ఆరంభంకానుండగా లీగ్‌లో సత్తాచాటేందుకు సన్నద్ధమవుతున్నాడు.10543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles