హమ్మయ్య.. రైనా టెస్ట్ పాసయ్యాడు!

Thu,December 21, 2017 03:10 PM

Suresh Raina clears Yo Yo Test in NCA

ముంబైః యొ.. యొ.. టెస్ట్.. టీమిండియా తలుపు తట్టాలంటే ఇప్పుడు ఈ ఎండ్యూరెన్స్ టెస్ట్ తప్పనిసరిగా పాస్ కావాలని రూల్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ అడ్డంకి అధిగమించలేక యువరాజ్, రైనాలాంటి సీనియర్లు దాదాపు ఏడాదిగా టీమ్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే మొత్తానికి సురేశ్ రైనా ఈ టెస్ట్ పాసయ్యాడు. ఈ విషయాన్ని అతడే ట్విట్టర్‌లో వెల్లడించాడు. ఎన్నో రోజుల హార్డ్ వర్క్ తర్వాత మొత్తానికి ఈ కఠిన పరీక్షను రైనా అధిగమించాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో గురువారం ఈ టెస్ట్ పాసైనట్లు రైనా చెప్పాడు. ఎన్‌సీఏలో ఉన్న ట్రైనర్లు, కోచ్‌లు, అధికారులంతా తనకు ఎంతో సహకరించారని, అందరికీ కృతజ్ఞతలని రైనా ట్వీట్ చేశాడు.


గత ఆగస్ట్‌లో రైనాతోపాటు యువరాజ్ కూడా ఈ యొ యొ టెస్ట్ ఫెయిలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రైనా ఎన్‌సీఏలో కఠినంగా శ్రమించాడు. ఈ వీడియోను కూడా గతంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఈ మధ్యే యువరాజ్ సింగ్ కూడా ఈ టెస్ట్ పాసైన విషయం తెలిసిందే. యొ యొ టెస్ట్‌లో భాగంగా రెండువైపులా 20 మీటర్ల దూరంలో రెండు లక్ష్యాలను (కోన్స్) ఏర్పాటు చేసి వాటి మధ్య ప్లేయర్స్‌ను పరుగెత్తిస్తారు. బీప్ సౌండ్ వచ్చేలోపు అవతలి లక్ష్యం చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. మొదట్లో బీప్ బీప్‌కీ మధ్య కాస్త ఎక్కువ సమయం ఇస్తారు. తర్వాత ఈ సమయాన్ని తగ్గిస్తూ వెళ్తారు. అందుకు తగినట్లు ప్లేయర్స తమ వేగాన్ని పెంచాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్లు ఆ స్పీడ్‌ను అందుకోలేకపోతున్నారని అనిపిస్తే టెస్ట్‌ను మధ్యలోనే ఆపేస్తారు. ఇదంతా కంప్యూటర్ ఆధారిత ప్రోగ్రామ్ ద్వారానే నిర్వహించి పాయింట్లు రికార్డు చేస్తారు. క్రికెట్‌తో పోలిస్తే ఫుట్‌బాల్, హాకీలాంటి గేమ్స్‌లో ఫిట్‌నెస్ స్థాయి ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి.. ఇదే టెస్ట్‌ను అందరికీ నిర్వహించినా వాళ్లు ఎక్కువ పాయింట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది.

4579
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles