శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం ఎత్తేయండి కానీ..!

Fri,March 15, 2019 12:30 PM

Supreme Court cancels Life Ban on Sreesanth but asks BCCI for a fresh punishment

న్యూఢిల్లీ: టీమిండియా పేస్ బౌలర్ శ్రీశాంత్‌కు కాస్త ఊరట కలిగించే తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. అతనిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తేయాలని బీసీసీఐని ఆదేశించింది. అయితే తనకు అసలు ఏ శిక్షా విధించవద్దన్న శ్రీశాంత్ అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చింది. అతనిపై జీవితకాల నిషేధం కాకుండా మరేదైనా శిక్ష విధించాలని, దీనిపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకుగాను శ్రీశాంత్ జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. శిక్షపై అతని వాదన కూడా కమిటీ వినాలని అశోక్ భూషణ్, కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. 2017, అక్టోబర్‌లో బీసీసీఐ పిటిషన్ మేరకు శ్రీశాంత్‌పై కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ మరోసారి జీవితకాల నిషేధాన్ని విధించింది. అంతకుముందు సింగిల్ జడ్జి అతనిపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయగా.. బీసీసీఐ దీనిని సవాలు చేసింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో 2013, మేలో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ అయిన శ్రీశాంత్‌తోపాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలాలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురినీ బీసీసీఐ నిషేధించింది.

2993
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles