ఢిల్లీపై ఫీల్డింగ్ ఎంచుకున్న స‌న్‌రైజ‌ర్స్.. జ‌ట్టులో మార్పులు

Sun,April 14, 2019 07:52 PM

Sunrisers Hyderabad have won the toss and have opted to field

హైద‌రాబాద్: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సన్‌రైజర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. సొంతగడ్డపై జరిగే నాలుగో మ్యాచ్‌లో సత్తా చాటాలని ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో త‌ల‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో టాస్ గెలిచిన స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జట్టు వైఫల్యాల నేపథ్యంలో తుది జ‌ట్టులో హైద‌రాబాద్ టీమ్ చాలా మార్పులు చేసింది. మ‌నీశ్ పాండే, సిద్ధార్థ్ కౌల్‌, యూసుఫ్ ప‌ఠాన్, ర‌షీద్ ఖాన్‌ స్థానంలో కేన్ విలియ‌మ్స‌న్‌, రికీ భుయ్‌, అభిషేక్ శ‌ర్మ‌, ఖ‌లీల్ అహ్మ‌ద్ టీమ్‌లోకి వ‌చ్చారు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కూడా గొప్పగా ఏమీలేదు. నిరుడు అత్యధిక వికెట్లు పడగొట్టిన సన్‌రైజర్స్‌ బౌలర్లు ఈసారి పేలవ ప్రదర్శన చేస్తున్నారు. మరోవైపు వరుసగా 2 విజయాలతో జోరుమీదున్న‌ ఢిల్లీ హ్యాట్రిక్‌పై దృష్టి సారించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఫామ్‌లోకి రావడంతో విజయంపై ఆ జట్టు ధీమాతో ఉంది.1575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles