పాక్ గెలుస్తుందన్న గవాస్కర్.. ఇండియాదే విక్టరీ అన్న అక్రమ్

Wed,September 19, 2018 03:17 PM

Sunil Gavaskar supports Pakistan, Wasim Akram picks India

హైదరాబాద్: మరికాసేపట్లో ఇండియా, పాక్ మధ్య ఉత్కంఠభరిత వన్డే జరగనున్నది. ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌పై మాజీ హేమాహేమీలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారు. ఇవాళ జరిగే మ్యాచ్‌లో పాక్ గెలుస్తుందని ఇండియన్ గ్రేట్ ప్లేయర్ సునిల్ గవాస్కర్ తెలిపాడు. విరాట్ కోహ్లీ లేని కారణంగా.. పాక్‌కు విక్టరీ ఛాన్సు ఎక్కువగా ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై పాక్ ఘన విజయం సాధించింది. అందుకే పాక్‌కు సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉందని గవాస్కర్ తెలిపాడు. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా గవాస్కర్ వాదనే వినిపించాడు. ఇలాంటి కండీషన్స్‌లో పాకిస్థానే ఫెవరేట్ అని మంజ్రేకర్ తెలిపాడు. మరో వైపు పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. కోహ్లీ టీమ్‌లో లేడు కాబట్టి.. పాక్ బౌలర్లకు అడ్వాంటేజ్ ఉంటుందని అక్రమ్ తెలిపాడు. కానీ పేప‌ర్‌పై మాత్రం ఇండియానే ఫెవరేట్ అని అక్రమ్ చెప్పాడు. కోహ్లీకి రెస్టు ఇవ్వడం సరైన నిర్ణయమే అని, గవాస్కర్, అజర్, సచిన్ టీమ్‌లో లేడంటే నేనెంతో కాన్ఫిడెంట్‌గా బౌలింగ్ చేసేవాడినని, అలాగే కోహ్లీ లేడు కాబట్టి పాక్ బౌలర్లు కూడా విజృంభిస్తారని అక్రమ్ తెలిపాడు.

2250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles