గవాస్కర్ నాగిని డ్యాన్స్ చూశారా.. వీడియో

Mon,March 19, 2018 04:29 PM

Sunil Gavaskar did snake dance in commentary box video goes viral

కొలంబోః టీ20 ట్రైసిరీస్‌లో శ్రీలంకపై గెలిచిన తర్వాత బంగ్లాదేశ్ ప్లేయర్స్ చేసిన హంగామా తెలుసు కదా. గ్రౌండ్‌లో నాగిని డ్యాన్స్ చేస్తూ చాలా అతి చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే అదే సిరీస్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై టీమిండియా గెలిచిన తర్వాత చాలా మంది బంగ్లా టీమ్‌ను హేళన చేస్తూ ఇలా నాగిని డ్యాన్స్ చేశారు. అందులో టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ కూడా ఉన్నాడు. అయితే టీమిండియా బ్యాటింగ్ కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే కామెంట్రీ బాక్స్‌లో గవాస్కర్ నాగిని డ్యాన్స్ చేయడం కనిపించింది. పక్కనే ఉన్న ఆసీస్ మాజీ పేస్ బౌలర్ బ్రెట్ లీ కోరిక మేరకు గవాస్కర్ కొన్ని స్టెప్పులేశాడు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. అయితే తమ టీమ్‌ను హేళన చేస్తూ గవాస్కర్ ఇలా డ్యాన్స్ చేశాడని బంగ్లా అభిమానులు మండిపడ్డారు. ట్విట్టర్‌లో సన్నీపై విమర్శలు గుప్పించారు.


3593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles