ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్‌కు సూర్యుడి అంతరాయం

Wed,January 23, 2019 12:01 PM

నేపియర్: క్రికెట్ మ్యాచ్‌లు వర్షం కారణంగానో, వెలుతురు సరిగా లేకపోవడం వల్లో ఆగిపోవడం చూసి ఉంటారు. కానీ సూర్యుడి వల్ల మ్యాచ్ నిలిచిపోవడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేకు సూర్యుడు అడ్డుపడ్డాడు. సూర్యాస్తమయం అవుతున్న సమయంలో ఆ కిరణాలు సరిగ్గా బ్యాట్స్‌మన్ కళ్లలోకి పడటంతో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందులు తలెత్తాయి. ఆ స‌మ‌యంలో బ్యాటింగ్ చేస్తున్న శిఖ‌ర్ ధావ‌న్ అంపైర్ల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపేయాలని అంపైర్లు నిర్ణయించారు. మనకు ఇది కొత్తగా అనిపించినా.. ఈ క్రికెట్ మైదానంలో ఇలా సూర్యుడు అడ్డుపడటం సహజమే. గతంలో సూపర్ స్మాష్ మ్యాచ్‌లకు కూడా ఇలాగే సూర్యుడు అడ్డుపడ్డాడు. స్టేడియం నిర్మించిన తీరు సరిగా లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.


4436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles