ఐపీఎల్‌లోకి స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్ వార్న‌ర్‌ 'రీ'ఎంట్రీ!

Fri,November 16, 2018 06:20 PM

Steve Smith and David Warner welcomed back by David Warner teams

ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లను ఆయా ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్నాయి. వారిని వేలంలోకి విడుదల చేయకుండా టీమ్‌లోనే కొనసాగిస్తున్నట్లు ఫ్రాంఛైజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా పర్యటనలో ఈ ఏడాది మార్చిలో కేప్‌టౌన్‌లో బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా వారిపై ఏడాది పాటు నిషేధం విధించడంతో గతేడాది ఐపీఎల్ సీజన్‌కు వీరిద్దరూ దూరమైన విషయం తెలిసిందే.

వచ్చే ఏడాది మే 30 నుంచి ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచకప్ ఆరంభంకానుండటంతో ఐపీఎల్ 12వ సీజన్‌ను వచ్చే ఏడాది మార్చి 29 నుంచి మే 19 మధ్య నిర్వహించాలని బీసీసీఐ షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. వీరిపై విధించిన నిషేధం కూడా టోర్నీమెంట్ ఆరంభమయ్యే రోజునే తొలగిపోనుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఐపీఎల్-12లో ఆయా జట్ల తరఫున బరిలో దిగే అవకాశం ఉంది. స్టీవ్ స్మిత్ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో కొనసాగుతున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వీరిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ.. ఐపీఎల్‌లో రీఎంట్రీపై ఐపీఎల్ మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

3385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles