లెగ్‌ స్పిన్నర్‌పై ఏడాది నిషేధం, జ‌రిమానా

Fri,July 20, 2018 09:01 PM

Sri Lankas Vandersay gets one-year suspended ban for misconduct

కొలంబో: శ్రీలంక లెగ్‌స్పిన్నర్ జెఫ్రీ వాండర్‌సేపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా శుక్రవారం నిషేధం విధించింది. అంతేకాదు కరీబియన్ పర్యటనలో అతడి దుష్ప్రవర్తనకు వార్షిక కాంట్రాక్టు ఫీజులో 20శాతం కోత విధించింది. క్రమశిక్షణను ఉల్లంఘించిన నేపథ్యంలో ఆతిథ్య వెస్టిండీస్ జట్టుతో మూడో టెస్టు మ్యాచ్‌కు ముందుగానే బ్రిడ్జ్‌టౌన్ నుంచి అతన్ని స్వేదేశానికి పంపించారు. విచారణ పూర్తైన తర్వాత అతడిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

సెయింట్ లూసియాలో విండీస్‌తో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిన తరువాత జట్టు సభ్యులతో నైట్‌క్లబ్‌కు వెళ్లిన జెఫ్రీ టీమ్ నిర్దేశిత సమయంలోగా ఆటగాళ్లు బసచేసిన హోటల్‌కు చేరుకోకపోవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఆందోళన చెందింది. తెల్లవారుజామున హోటల్‌కు చేరుకోవడంతో అతడి చర్యను తీవ్రంగా పరిగణించింది. విచారణలో 28ఏళ్ల వాండర్‌సే తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు బోర్డు పేర్కొంది. 2015లో అరంగేట్రం చేసిన వాండర్‌సే శ్రీలంక తరఫున 11వన్డే మ్యాచ్‌లు, 7 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.

2353
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles