పాకిస్థాన్‌కు షాక్.. శ్రీలంకదే టెస్ట్ సిరీస్

Tue,October 10, 2017 05:14 PM

Sri Lanka win the second test against Pakistan

దుబాయ్: పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. సొంతగడ్డపై శ్రీలంక చేతిలో టెస్ట్ సిరీస్‌ను 0-2తో ఓడిపోయింది. యూఏఈని తమ సొంతగడ్డగా మార్చుకున్న తర్వాత ఇక్కడ టెస్ట్ సిరీస్ ఓడిపోవడం పాక్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. రెండో టెస్ట్‌లోనూ 68 పరుగుల తేడాతో ఓడింది పాకిస్థాన్. 317 పరగులు లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 248 రన్స్‌కే ఆలౌటైంది. నాలుగో రోజు అసద్ షఫిక్, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పోరాటంతో గెలుపుపై ఆశలు చిగురించినా.. చివరి రోజు లంక బౌలర్లు చెలరేగడంతో ఓటమి తప్పలేదు. ఐదో రోజు 50 పరుగులు జోడించి 5 వికెట్లు కోల్పోయింది. 5 వికెట్లకు 198 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్.. తొలి సెషన్‌లోనే మిగతా వికెట్లన్నీ కోల్పోయింది. 225 పరుగుల దగ్గర కెప్టెన్ సర్ఫరాజ్ (68) ఔటవడంతో పాక్ వికెట్ల పతనం మొదలైంది. షఫిక్ (112)తో కలిసి ఆరో వికెట్‌కు 173 పరుగులు జోడించాడు సర్ఫరాజ్. ఈ జోడీని విడగొట్టడంతో లంక బౌలర్ల పని సులువైంది. మిగతా నాలుగు వికెట్లు 23 పరుగుల తేడాలో పాక్ కోల్పోయింది. లంక బౌలర్లలో పెరీరా 5 వికెట్లు తీశాడు. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో శ్రీలంక ఎగరేసుకుపోయింది. వరుస ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీలంకకు విదేశీ గడ్డపై ఇంతటి అద్భుత విజయం ఊరట కలిగించేదే.
1627
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles