పాకిస్థాన్‌లో పర్యటించనున్న శ్రీలంక క్రికెట్‌ జట్టు

Fri,August 23, 2019 07:00 PM

Sri Lanka to Play Six Limited-Overs Matches in Pakistan Next Month

కొలంబో: సుదీర్ఘ విరామం తర్వాత శ్రీలంక క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించిందేకు సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో పాక్‌ వేదికగా క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడతామని శ్రీలంక స్పోర్ట్స్‌ మినిస్టర్‌ తెలిపారు. 'టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు పాక్‌కు తమ జట్టును పంపేందుకు సిద్ధంగాలేము. కానీ, ఎనిమిది రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తాం. ఈ టూర్‌లో వన్డేలు లేదా టీ20 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందని' హరీన్‌ ఫెర్నాండో విలేకరుల సమావేశంలో వివరించారు.

ఇదే విషయంపై శ్రీలంక క్రికెట్‌ బోర్డు స్పందించింది. 'సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 9 మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడుతాం. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆడాల్సిన మ్యాచ్‌లను డిసెంబర్‌కు వాయిదా వేశాం. వన్డేలకు కరాచీ.. టీ20లకు లాహోర్‌ ఆతిథ్యమిస్తాయని' ఆ దేశ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంకతో జరిపిన చర్చలు విజయవంతం కావడంపై పీసీబీ సంతృప్తి వ్యక్తం చేసింది. 2009లో శ్రీలంక క్రికెటర్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి జరిపిన తర్వాత విదేశీ అగ్రశ్రేణి జట్లు ఆ దేశంలో పర్యటించేందుకు నిరాకరిస్తున్నాయి.

1579
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles