క్రీడాకారులు దేశ ఆత్మగౌరవం: అమితాబ్‌బచ్చన్

Tue,September 25, 2018 03:16 PM

Sportspeople are the pride of the country says Big B

ముంబై : క్రీడాకారులు మనదేశ ఆత్మగౌరవమని, వారిని సత్కరించడం దేశాన్ని గౌరవించడమేనని బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్. రియాలిటీ టీవీ గేమ్ షో ‘కౌన్ బనేగా కరోర్‌పతి’కు బిగ్ బీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కేబీసీ కర్మ్‌వీర్ ఎపిసోడ్‌లో భాగంగా జాతీయ పురుషుల హాకీ టీం సభ్యులు ఈ షోలో సందడిచేశారు.

ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ..దేశం పట్ల క్రీడాకారులకున్న అంకితభావం, కృషి వర్ణించలేనిది. క్రీడాకారులను గౌరవించుకుంటే..మన దేశాన్ని గౌరవించినట్లే. క్రీడాకారులు మనదేశ ఆత్మగౌరవం. క్రీడ అనేది దేశానికి గుర్తింపు తెచ్చేది. క్రీడాకారులు దేశానికి బ్రాండ్ అంబాసిడర్లని అమితాబ్ ట్వీట్ చేశారు. వచ్చే నెల ఒడిశాలో జరుగనున్న వరల్డ్‌కప్‌లో హాకీ టీం విజయం సాధించాలని కోరుకోవాలని ప్రజలను కోరారు బిగ్‌బీ.

411
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS