ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు దోహదం చేస్తాయి: మంత్రి

Mon,October 21, 2019 07:47 AM

రాజేంద్రనగర్: ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు, వ్యాయామం ఎంతో దోహదం చేస్తాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం రాజేంద్రనగర్‌లోని విజయ్ ఆనంద్ క్రికెట్ గ్రౌండ్‌లో కన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్‌కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 500 ఎకరాలలో అతిపెద్ద ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనికి సీఐఐ సహకారం అందించాలన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య, సీఐఐ ప్రతినిధులు అభిషేక్, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles