బైబై సాయ్.. వెల్‌కమ్ ‘స్పోర్ట్స్‌ ఇండియా’!

Tue,February 12, 2019 02:41 PM

Sports Authority of India renamed Sports India

న్యూఢిల్లీ: స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) పేరును ‘స్పోర్ట్స్‌ ఇండియా’గా మార్చినట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ కొన్ని నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సాయ్‌కు బై..బై.. చెప్పేసి.. స్పోర్ట్స్ ఇండియాకు కేంద్ర క్రీడాశాఖ స్వాగతం పలికింది. గంటకు పైగా జరిగిన సమావేశంలో క్రీడాశాఖ, సాయ్ అధికారులు పలు అంశాలపై సుధీర్ఘం చర్చించి పేరు మార్పుకు అధికారికంగా ఆమోదముద్ర వేశారు. శాస్త్రభవన్‌లో రాజ్యవర్దన్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్‌లో పేరు మార్పు విషయం తెలియజేయడమే మిగిలిందని అది కూడా వారంలోగా పూర్తవుతుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దేశంలో క్రీడల అభివృద్ధి కోసం 1984లో సాయ్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.

1180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles