మొరాక్కోతో డ్రా.. నాకౌట్‌కు స్పెయిన్

Tue,June 26, 2018 10:08 AM

Spain draws with Morocco and enters knock out stage at football worldcup

మాస్కో: ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ నాకౌట్ దశకు స్పెయిన్ చేరుకుంది. గ్రూప్ బి నుంచి ఆ టీమ్ టాప్‌లో నిలిచింది. సోమవారం మొరాక్కోతో జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్‌తో డ్రాగా ముగిసింది. దీంతో స్పెయిన్ ఆ గ్రూప్ నుంచి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. టాప్‌లో నిలిచిన స్పెయిన్ తన నాకౌట్ మ్యాచ్‌ను హోస్ట్ టీమ్ రష్యాతో ఆడనున్నది. స్పెయిన్ టీమ్ నుంచి ఇస్కో 19వ నిమిషంలో, ఆ తర్వాత అస్పాస్ 90వ నిమిషంలో గోల్స్ చేశారు. మొరాక్కో జట్టుకు 14వ నిమిషంలో బౌటా, 81వ నిమిషంలో ఎన్ నెసిరి గోల్స్ చేశారు. ఈ మ్యాచ్‌లోనూ వీడియో అసిస్టెంట్ రిఫెరీపై రెండు జట్లు ఆధారపడ్డాయి. స్పెయిన్ ప్లేయర్ ఆట చివరి నిమిషంలో గోల్ చేయడంతో గ్రూప్ బీలో క్లయిమ్యాక్స్ ఆసక్తికరంగా ముగిసింది.

828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles