టీమిండియాపై టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

Tue,February 13, 2018 04:24 PM

South Africa won the toss and opt to bowl


పోర్ట్ ఎలిజబెత్: భారత్‌తో కీలకమైన ఐదో వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న సఫారీలు ఈ వన్డేలోనూ బౌలింగ్ వైపే మొగ్గుచూపారు. ఆల్‌రౌండర్ క్రిస్‌మోరీస్ స్థానంలో షమ్షీని జట్టులోకి తీసుకుంటున్నట్లు మార్‌క్రమ్ వెల్లడించాడు. మరోవైపు తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయట్లేదని గత మ్యాచ్‌లో ఆడిన టీమ్ నేటి మ్యాచ్‌లో ఆడుతుందని భారత సారథి విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఆతిథ్య జట్టు సిరీస్‌లో నిలిచేందుకు పోరాడుతోందని.. తాము సిరీస్ కైవసం చేసుకునే లక్ష్యంతో బరిలో దిగుతున్నామని విరాట్ పేర్కొన్నాడు.

1755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles