ఇండియా గెలవాలనుకున్న ఈ సౌతాఫ్రికన్ ఎవరో తెలుసా?

Thu,January 18, 2018 01:53 PM

South Africa team bus driver Andre Krog wanted India to win here is why

సెంచూరియన్‌ః నిజమే.. రెండో టెస్ట్ చివరి రోజు మొదలయ్యే ముందు ఓ సౌతాఫ్రికన్ ఇండియా గెలవాలని ప్రార్థించాడు. సఫారీలు సిరీస్ గెలవొద్దని కోరుకున్నాడు. తాను సౌతాఫ్రికాకు చెందిన వ్యక్తే అయినా.. ఇండియన్ ప్లేయర్స్ మంచితనం అతన్ని కట్టిపడేసింది. అతనెవరో కాదు.. సౌతాఫ్రికా టీమ్ బస్ డ్రైవర్ ఆండ్రీ క్రోగ్. కేప్‌టౌన్‌లో, సెంచూరియన్‌లో సౌతాఫ్రికా టీమ్‌ను హోటల్‌కు, స్టేడియానికి తీసుకెళ్లింది ఇతనే. అయినా అతను ఇండియన్ టీమ్ గెలవాలని కోరుకున్నాడు. ఎందుకూ అని అడిగితే.. అసలు విషయం చెప్పాడు. మన ప్లేయర్స్‌ను ఆకాశానికెత్తాడు. సౌతాఫ్రికా ప్లేయర్స్ కూడా తనతో ఎంతో హుందాగా వ్యవహరిస్తారని, అయితే వాళ్ల టీమ్‌లోని ఓ అధికారి మాత్రం తనను డ్రైవర్‌గా కాదు కదా.. కనీసం మనషిగా కూడా చూడడని ఆండ్రీ చెప్పాడు. తన బాగోగులు అస్సలు పట్టించుకోడని, కనీసం మంచి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన కూడా అతనికి లేదని ఆండ్రీ ఆగ్రహం వ్యక్తంచేశాడు. అదే సమయంలో తన ఫ్రెండ్, ఇండియన్ టీమ్ బస్ డ్రైవర్ రోనీ మూడ్లేని కోహ్లి సేన ఎంత బాగా చూసుకుంటుందో చూసి ఆండ్రీ ఆశ్చర్యపోయాడు.

ఇండియన్ టీమ్ మెంబర్స్ చాలా మంచోళ్లు. వాళ్లు డ్రైవర్(రోనీ మూడ్లీ)ను ఎంతో గౌరవంగా చూస్తారు. తమ టీమ్‌లో ఒకడిగా భావిస్తారు. రోనీ, నేను టీమ్స్ కోసం బయట వేచి చూస్తుంటే.. ఇండియన్ టీమ్ సభ్యులే మాకు కావాల్సిన నీళ్లు, కూల్ డ్రింక్స్ ఇచ్చారు. డ్రైవర్ కనీస అవసరాలేంటో తెలుసుకొని ఇవ్వడం ఎంత గొప్ప విషయం. అంతేకాదు ఇండియన్ ప్లేయర్స్ ఎంత మంచోళ్లంటే.. తమ డ్రైవర్ ఫ్రెండ్స్ కోసం టికెట్లు అడిగితే.. ఇచ్చారు. నేను అడిగితే.. నాకు కూడా వాళ్లే టికెట్లు ఏర్పాటుచేశారు అని ఆండ్రీ చెప్పుకొచ్చాడు. మరి క్రికెట్ సౌతాఫ్రికాను ఎందుకు టికెట్లు అడగలేదు అని అడిగితే.. నాకు లంచ్ కూపన్లు ఇవ్వాల్సిన వ్యక్తి ఆ విషయం కూడా మరచిపోతాడు. అలాంటి వారిని టికెట్లు ఏమడుగుతాం. ఇండియన్ టీమ్‌లో నాకు సాయం చేయడానికి చాలా మంది ఉన్నారు అని ఆండ్రీ చెప్పాడు. అందుకే తాను కనీసం సౌతాఫ్రికా టీమ్ జెర్సీ వేసుకోవడానికి కూడా నిరాకరించాడు. తన కంపెనీ షర్ట్ వేసుకొనే టీమ్‌తోపాటు తిరుగుతున్నాడు.

2362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles