కివీస్ విజయ లక్ష్యం 242..

Wed,June 19, 2019 08:16 PM

south africa made 241 runs against newzealand in world cup 2019 match

బర్మింగ్‌హామ్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. వర్షం వల్ల అంతకు ముందు ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో మ్యాచ్‌ను ప్రారంభించడం ఆలస్యం అయింది. దీంతో అంపైర్లు ఇరు వైపులా చెరొక ఓవర్‌ను తగ్గించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా 49 ఓవర్లు ఆడింది.

కాగా సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో రాస్సీ వాన్ డర్ డుస్సెన్ (64 బంతుల్లో 67 పరుగులు, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హషీం ఆమ్లా (83 బంతుల్లో 55 పరుగులు, 4 ఫోర్లు)లు మాత్రమే అర్ధసెంచరీలు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. దీంతో సౌతాఫ్రికా చాలా తక్కువ స్కోరు నమోదు చేసింది. ఇక కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 3 వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, మిచెల్ సాన్టనర్‌లు తలా 1 వికెట్ తీశారు.

3554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles