లెక్క సరిచేసిన సౌతాఫ్రికా..

Mon,September 23, 2019 07:30 AM

బెంగళూరు: చివరి టీ-20 మ్యాచ్‌లో సఫారీ జట్టు భారత్‌కు ఝలక్ ఇచ్చింది. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మరో 3.1 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సఫారీ సారథి క్వింటన్ డీ కాక్ ఛేదనలో రెచ్చిపోయాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. మామూలగానైతే ఇండియా ప్రత్యర్థి జట్టును స్పిన్ ఉచ్చులో బిగిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ, ఏ దశలోనూ వికెట్లు నిలుపుకోలేదు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు స్పిన్‌పై అటాక్ చేద్దామనుకున్న ఇండియా బ్యాట్స్‌మెన్‌ను సఫారీ జట్టు స్పిన్‌తోనే నిలువరించింది. పరుగులు రాకుండా అడ్డుకుంది. స్పిన్నర్లు ఫోర్టోయిన్(2/19), షంసి (1/23), పేసర్లు హెండ్రిక్స్ (2/14), రబాడా(3/39)తో రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 134 పరుగులకే పరిమితమైంది. భారత్ బ్యాట్స్‌మెన్‌లో టాప్ స్కోరర్ ధావన్(36). మిగితా బ్యాట్స్‌మెన్ రాణించలేదు.


135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు కెప్టెన్ డీ కాక్(79 నాటౌట్) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 16.5 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన సౌతాఫ్రికా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 4 ఓవర్లు వేసి 14 పరుగులు మాత్రమే ఇచ్చి, 2 కీలక వికెట్లు తీసిన హెండ్రిక్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్ ఇండియా గెలిచింది. దీంతో సిరీస్ 1-1 తో సమమైంది. ఇక తదుపరి మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ అక్టోబర్ 2న విశాఖపట్నంలో ప్రారంభమౌతుంది.

1538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles