మరో మ్యాచ్ వర్షార్పణం.. సౌతాఫ్రికా, విండీస్ మ్యాచ్ రద్దు..!

Mon,June 10, 2019 09:07 PM

south africa and west indies match abandoned due to rain

లండన్: సౌతాంప్టన్‌లోని ది రోజ్‌బౌల్ మైదానంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 టోర్నీ 15వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. ఆ జట్టు 7.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. హషీం ఆమ్లా (7 బంతుల్లో 6 పరుగులు, 1 ఫోర్), మార్క్రం (10 బంతుల్లో 5 పరుగులు, 1 ఫోర్)లు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యారు. అనంతరం క్వింటన్ డి కాక్ (21 బంతుల్లో 17 పరుగులు, 1 ఫోర్), కెప్టెన్ డుప్లెసిస్ (7 బంతుల్లో 0 పరుగులు)లు క్రీజులో కొంత సేపు కొనసాగారు. కాగా వెస్టిండీస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ 2 వికెట్లు తీశాడు. అయితే కొంత సమయం గడిచాక వర్షం పడడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వర్షం ఒక దశలో తగ్గినప్పటికీ మళ్లీ వెంటనే రావడం.. ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లు చెరొక పాయింట్‌ను పొందాయి.

4578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles