65 ఏళ్ల త‌ర్వాత‌.. బీసీసీఐ అధ్య‌క్షుడిగా మాజీ క్రికెట‌ర్‌

Wed,October 23, 2019 01:07 PM

హైద‌రాబాద్‌: మాజీ క్రికెట‌ర్ సౌర‌వ్ గంగూలీ ఇవాళ బీసీసీఐ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే 65 ఏళ్ల త‌ర్వాత ఓ మాజీ క్రికెట‌ర్ .. బీసీసీఐ బోర్డు ప‌గ్గాలు చేప‌ట్ట‌డం ఇదే తొలిసారి. ముంబైలో ఇవాళ జ‌రిగిన స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో గంగూలీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. దీంతో సుప్రీంకోర్టు నియ‌మించిన క‌మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేట‌ర్స్ ప్యాన‌ల్ ప‌ద‌వీకాలం ముగిసింది. ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ ఎన్‌. గోపాల‌స్వామి చేతుల మీదుగా గంగూలీ ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. సీఓఏ స‌భ్యులు, రాష్ట్ర సంఘాల ప్ర‌తినిధులు కూడా ఈ వేడుక‌లో పాల్గొన్నారు. గంగూలీతో పాటు న‌లుగురు ఆఫీస్ బియ‌ర‌ర్లు.. సీఓఏ నుంచి సంపూర్ణంగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు. గ‌త 33 నెల‌ల నుంచి సీఓఏనే .. బీసీసీఐ బోర్డును నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. వినోద్ రాయ్‌, డ‌యానా ఎడుల్జీ, లెఫ్టినెంట్ ర‌వి తోడ్జేలు .. ఇన్నాళ్లూ సీఓఏ స‌భ్యులుగా ఉన్నారు.


సంతృప్తిక‌రంగానే బీసీసీఐని వీడుతున్న‌ట్లు సీఓఏ స‌భ్యుడు వినోద్ రాయ్ తెలిపారు. బీసీసీఐ ప‌గ్గాలు చేపట్టిన గంగూలీ.. ఉత్త‌మ కెప్టెన్ అని రాయ్ కొనియాడారు. బెంగాల్ క్రికెట్ సంఘానికి కూడా అయిదేళ్లు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించార‌న్నారు. బీసీసీఐ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు గంగూలీ క‌న్నా బెట‌ర్ ఎవ‌రూ లేర‌ని రాయ్ అన్నారు. రాజ్యాగం ప్ర‌కారం బీసీసీఐలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం త‌మ బాధ్య‌త అని, దానికి త‌గిన‌ట్టుగానే ఆ ప‌ని నిర్వ‌ర్తించామ‌ని రాయ్ తెలిపారు. ఓ మాజీ క్రికెట‌ర్ బీసీసీఐ ప‌గ్గాలు చేప‌ట్ట‌డం సంతోషంగా ఉంద‌ని సీఓఏలోని మ‌రో స‌భ్యుడు ఎడుల్జీ అన్నారు. బీసీసీఐని గంగూలీ మ‌రింత ఉన్న‌త స్థానాల‌కు చేరుస్తాడ‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు.

1114
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles