బ్యాట్స్‌మ‌న్‌కు మిడిల్‌ ఫింగ‌ర్ చూపిన బౌల‌ర్‌

Sat,August 11, 2018 01:28 PM

Sohail Tanvir fined 15 percent match fee for obscene gesture

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ దీవుల్లో కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో అనుచితంగా వ్యవహరించిన పాకిస్థాన్ లెఫ్టార్మ్ సీమర్ సొహైల్ తన్వీర్‌కు జరిమానా పడింది. గయానా అమెజాన్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో తన్వీర్ హద్దుమీరి ప్రవర్తించాడు.

సెయింట్ కిట్స్ తరఫున ఆడుతున్న బెన్ కటింగ్‌ను బౌల్డ్ చేసిన తరువాత బ్యాట్స్‌మన్‌వైపు రెండు చేతుల‌తో మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు. ఈ సంఘ‌ట‌న తొలి ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్‌లో చోటుచేసుకుంది. ఇదంతా లైవ్‌లో ప్రసారం కావడంతో సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. లీగ్‌లో ట్రిబాగో నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్‌లిన్.. బ్యాట్స్‌మన్ ఔటైన తరువాత సొహైల్ వ్యవహరించిన తీరును ఖండించాడు.
4889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles