టీమ్ ప్రాక్టీస్ చేస్తుండగా వణికించిన పాము.. వీడియో

Mon,October 15, 2018 03:03 PM

Snake invades England cricket team practice camp

డంబుల్లా: ఓవైపు ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నది. మరోవైపు అనుకోని అతిథిలా ఓ విషపూరిత పాము వాళ్ల క్యాంప్‌లో దూరింది. ఈ పామును ఇద్దరు వ్యక్తులు అదుపు చేస్తున్న సమయంలో తీసిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఐదు వన్డేలు, మూడు టెస్టులు, ఒక టీ20 సిరీస్ కోసం శ్రీలంక టూర్‌కు ఇంగ్లండ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య డంబుల్లాలో జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఇక రెండో వన్డేకు కూడా వరుణుడు అడ్డు పడినా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్‌లో 31 పరుగులతో గెలిచింది. కెప్టెన్ మోర్గాన్ 92 పరుగులతో రాణించాడు. ఇప్పుడు మూడో వన్డే కోసం ఇంగ్లండ్ టీమ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది.


4308
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles