రోహిత్ అర్ధశతకం.. చెన్నై లక్ష్యం 156

Fri,April 26, 2019 10:01 PM

skipper rohith   key performer for the first innings for his 48 ball 67

చెన్నై: చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు155 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(67: 48 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడంతో ముంబయి ఆమాత్రం స్కోరైనా చేసింది. ఆరంభంలోనే క్వింటన్ డికాక్ ఔటైనప్పటికీ ఎవిన్ లూయిస్‌(32)తో కలిసి రోహిత్ స్కోరు బోర్డును ముందుండి నడిపించాడు. 12 ఓవర్లు ముగిసేవరకు వికెట్ నష్టానికి ముంబయి 99 పరుగులతో పటిష్ఠస్థితిలో ఉంది. ఆ తర్వాతి ఓవర్‌లోనే లూయిస్ వెనుదిరగడంతో స్కోరు వేగం తగ్గింది. ఆ తర్వాతి ఓవర్లలో ఆశించిన మేర పరుగులు రాబట్టలేకపోయారు. శాంట్నర్ వేసిన 17వ ఓవర్‌లో రోహిత్ ఔటయ్యాడు. ఆఖర్లో హార్డిక్ పాండ్య(23నాటౌట్‌), కీరన్ పొలార్డ్(13నాటౌట్‌) విజృంభించడంతో 150 పరుగుల మార్క్‌ను చేరింది. చెన్నై బౌలర్లలో సాంట్నర్‌కు రెండు, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్‌కు చెరో వికెట్ దక్కింది.

3141
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles