చైనా ఓపెన్‌ సూపర్‌ టోర్నీలో సింధు ఓటమి

Thu,September 19, 2019 07:06 PM

చాంగ్‌జౌ: ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సింధు చైనా ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీలో రెండో రౌండ్‌లోనే పరాజయం పాలైంది. ఈ రోజు జరిగిన రెండో రౌండ్‌లో సింధు 21-12, 13-21, 19-21 తేడాతో పోర్న్‌పావే చూచువోంగ్‌(థాయిలాండ్‌) చేతిలో ఓటమి చెందింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి జోష్‌లో ఉన్న సింధు ఈ ఓటమితో తీవ్ర నిరాశకు గురైంది. తొలి గేమ్‌లో సునాయాస విజయం సాధించిన సింధు తర్వాత జరిగిన వరుస సెట్లలో ఓడింది. మొదటి రెండు గేముల్లో ఇద్దరూ చెరో గేమ్‌లో ఆధిపత్యం చెలాయించారు. నిర్ణాయక మూడో గేమ్‌లో హోరాహోరీగా తలపడగా చివరికి ‘థాయ్‌’ అమ్మాయే గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది.


దీంతో, సింధు టోర్నీ నుంచి నిష్క్రమించింది. మొదటి రౌండ్‌లో సింధు 2012 స్వర్ణపతక విజేత లీ జురుయ్‌(చైనా)పై 21-18, 21-12తో వరుససెట్లలో అలవోకగా గెలవగా.. రెండో రౌండ్‌లో ఓటమి పాలై స్వదేశానికి బయల్దేరింది.

1103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles