పాండ్య‌, రాహుల్‌ స్థానాల్లో జట్టులోకి శుభ్‌మ‌న్‌, శంకర్‌..!

Sun,January 13, 2019 09:36 AM

Shubham Gill, Vijay Shankar to replace Rahul and Pandya

ముంబై: ఓ టీవీ షోలో మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి సస్పెన్షన్‌కు గురైన భార‌త క్రికెట‌ర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌కు బదులుగా ఆల్‌రౌండ‌ర్‌ విజయ్ శంకర్‌, బ్యాట్స్‌మ‌న్ శుభ్‌మ‌న్ గిల్‌ను సీనియ‌ర్ సెల‌క్ష‌న్‌ క‌మిటీ ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు వన్డేల్లో వీరిద్దరు జట్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ సీనియర్ అధికారి ఒక‌రు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో రెండో వ‌న్డే మంగ‌ళ‌వారం అడిలైడ్‌లో జ‌రుగనుంది.

మ‌రోవైపు విజ‌య్ ఇప్ప‌టికే టీ20ల్లో టీమిండియా త‌ర‌ఫున అరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. ఆసీస్‌తో రెండో వ‌న్డే ఆరంభానికి ముందే శంక‌ర్ జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. న్యూజిలాండ్‌తో వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు దేశ‌వాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న‌యువ క్రికెట‌ర్ శుభ్‌మ‌న్‌ను ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సిరీస్‌ల‌కు ఎంపికైన‌ రాహుల్‌, పాండ్యల స్థానాలను శుభ్‌మ‌న్‌, శంక‌ర్‌ల‌తో భ‌ర్తీ చేశారు.

2518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles